కీర్తనలు త్యాగరాజు తొలి నేను జేసిన పూజాఫలమీలాగే
కోకిలధ్వని - ఆది
పల్లవి:
తొలి నేను జేసిన పూజాఫలమీలాగే తొ..
అను పల్లవి:
వెలవేసి తీయఁగవచ్చునా వెత దీరునా మనసారఁగ తొ..
చరణము(లు):
పరమాత్మ! నీకాయాసపడఁ
బనిలేదురా కరుణాకర!
వర భక్తవేసము వేయువేళ
వర్జకాలమేమో? త్యాగరాజనుత! తొ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - toli neenu jeesina puujaaphalamiilaagee ( telugu andhra )