కీర్తనలు త్యాగరాజు దరిని తెలిసికొంటి త్రిపుర సుం
శుద్ధసావేరి - ఆది
పల్లవి:
దరిని తెలిసికొంటి త్రిపుర సుం
దరి నిన్నే శరణంటి ద..
అను పల్లవి:
మరుని జనకుడైన మా దశరథ కు
మారుని సోదరి దయాపరి మోక్ష ద..
చరణము(లు):
అంబ త్రిజగదీశ్వరీ ముఖజితవిధు
బింబయాదిపురమున నెలకొన్న కన
కాంబరి నమ్మినవారికభీష్ట వ
రంబు లొసఁగు దీనలోకరక్షకి
అంబుజభవ పురుహూత సనందన
తుంబురునారదులందరు నీదు ప
దంబునుగోరి సదా నిత్యానం
దాంబుధిలో నోలలాడుచుండే ద..
మహదైశ్వర్యమొసఁగి తొలికర్మ
గహనమును గొట్టి బ్రోచు తల్లి
గుహగజముఖజనని యరుణపంకే
రుహనయన యోగిహృత్సదన
తుహినాచలతనయ నీ చక్కని
మహిమాతిశయమ్ములచేతను యీ
మహిలో మునిగణములు ప్రకృతి వి
రహితులై నిత్యానందులైన ద..
రాజితమణిగణభూషిణి మదగజ
రాజగమన లోకశంకరి దనుజ
రాజగురుని వాసరసేవ తన
కే జన్మఫలమో కనుగొంటిని
ఆజన్మము పెద్దలు తమ మదిలో
నీ జపమే ముక్తిమార్గమనుకొన
రాజశేఖరుండగు శ్రీ త్యాగ
రాజమనోహరి గౌరి పరాత్పరి ద..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - darini telisikoMTi tripura suM ( telugu andhra )