కీర్తనలు త్యాగరాజు దాచుకోవలెనా దాశరథి నీ దయ
తోడి - జంప
పల్లవి:
దాచుకోవలెనా దాశరథి నీ దయ దా..
అను పల్లవి:
జూచువారలలోన చులకనే ననుఁజూచి దా..
చరణము(లు):
కనికరము కాంతపైఁగలిగి ముద్దిడువేళ
జనకజ నా మాటసమయమని బల్కితే దా..
కరఁగి పదములవ్రాలఁ గని కరుణసేయువేళ
భరతుఁడెంతో నన్ను భక్తుఁడని పల్కితే దా..
నేమమునఁ బరిచర్య నేర్పును బొగడువేళ
సౌమిత్రి త్యాగరాజునిమాట బల్కితే దా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - daachukoovalenaa daasharathi nii daya ( telugu andhra )