కీర్తనలు త్యాగరాజు దాశరథీ నీ ఋణముఁదీర్ప నా
తోడి - దేశాది
పల్లవి:
దాశరథీ నీ ఋణముఁదీర్ప నా
తరమా పరమపావననామ దా..
అను పల్లవి:
ఆశదీర దూరదేశములను ప్ర
కాశింపఁ జేసిన రసికశిరోమణి దా..
చరణము(లు):
భక్తిలేని కవిజాలవరేణ్యులు
భావమెఱుఁగలేరని కలలోఁ జని
భుక్తిముక్తికల్గునని కీర్తనముల
బోధించిన త్యాగరాజుకరార్చిత దా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - daasharathii nii R^iNamu.rdiirpa naa ( telugu andhra )