కీర్తనలు త్యాగరాజు దినమణి వంశతిలక లావణ్య దీనశరణ్య
హరికాంభోజి - ఆది
పల్లవి:
దినమణి వంశతిలక లావణ్య దీనశరణ్య ॥ది॥
అను పల్లవి:
మనవిని బాగుగా మదిని దలంచుచు
చనువున నేలు చాలుగాఁ జాలు ॥ది॥
చరణము(లు):
శర్వవినుత నను సంరక్షించను
గర్వమునేల గాచువారెవరే
నిర్వికారగుణ నిర్మల కరధృత
పర్వత త్యాగరాజసర్వస్వమౌ ॥ది॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - dinamaNi vaMshatilaka laavaNya diinasharaNya ( telugu andhra )