కీర్తనలు త్యాగరాజు దుర్మార్గచరాధములను దొరనీవనజాలరా
రంజని - రూపక
పల్లవి:
దుర్మార్గచరాధములను దొరనీవనజాలరా దు..
అను పల్లవి:
ధర్మాత్మక ధనధాన్యము దైవము నీవై యుండగ దు..
చరణము(లు):
పలుకుబోటిని సభలోన పతితమానవులకొసఁగే దు..
ఖలుల నెచ్చట పొగడని శ్రీకర త్యాగరాజ వినుత దు..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - durmaargacharaadhamulanu doraniivanajaalaraa ( telugu andhra )