కీర్తనలు త్యాగరాజు దేవ, శ్రీ తపస్తీర్థ పురనివాస, దేహి భక్తి మధునా
మధ్యమావతి - త్రిపుట
పల్లవి:
దేవ, శ్రీ తపస్తీర్థ పురనివాస, దేహి భక్తి మధునా ॥దేవ॥
అను పల్లవి:
పావన ప్రవృద్ధ శ్రీమతి హృ
ద్భవన సకలజగ దవన శ్రీమహా ॥దేవ॥
చరణము(లు):
పాశహస్త గణేశ హరణ ప
లాశనారినితేశ వరద కు
శేశ యారిధరాశ రేభమృ
గేశ సప్తఋషీశ దేవ ॥దేవ॥
నీలగళ సుర జాల నుత నత
ఫాలగిరీశ ఫాల కృ
పాలవాల సుశీల గౌరీ
లోల శివ మాం పాలయాద్భుత ॥దేవ॥
నాగపూజిత నాగ దనుజ హ
రా గమర్ధన వాగాధిప విను
తా గణితగుణ రాగమదదూ
రా ఘహర శ్రీ త్యాగరాజ ॥దేవ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - deeva, shrii tapastiirtha puranivaasa, deehi bhakti madhunaa ( telugu andhra )