కీర్తనలు త్యాగరాజు దేవాది దేవ, సదాశివ, దిననాథ సుధాకర దహన నయన
సింధునామ క్రియ - దేశాది
పల్లవి:
దేవాది దేవ, సదాశివ,
దిననాథ సుధాకర దహన నయన ॥దేవాది॥
అను పల్లవి:
దేవేశ! పితామహ మృగ్య శమా
ది గుణాభరణ గౌరీ రమణ ॥దేవాది॥
చరణము(లు):
భవచంద్ర కళాధర నీలగళ
భానుకోటి సంకాశ శ్రీశనుత
తవ పాద భక్తిం దేహి దీనబంధో
దరహాస వదన త్యాగరాజనుత ॥దేవాది॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - deevaadi deeva, sadaashiva, dinanaatha sudhaakara dahana nayana ( telugu andhra )