కీర్తనలు త్యాగరాజు దేహి తవ పద భక్తిం, వైదేహి పతిత పావనీ, మే సదా
శహాన - ఆది
పల్లవి:
దేహి తవ పద భక్తిం, వైదేహి
పతిత పావనీ, మే సదా ॥దేహి॥
అను పల్లవి:
ఐహి కాముష్మిక ఫలదే
కమలాస నాద్యజ వర జననీ ॥దేహి॥
చరణము(లు):
కలశ వారాశి జనితే కనక భూషణ లసితే
కలశ జగీత ముదితే కాకుత్స్థరాజ సహితే ॥దేహి॥
అఖిలాండ రూపిణి అళికుళ నిభ వేణీ
మఘ సంరక్షణరాణీ మమ భాగ్యకారిణీ ॥దేహి॥
శరణాగతపాలనే శతమఖమద దమనే
తరుణారుణాబ్జనయనే త్యాగరాజ హృత్సదనే ॥దేహి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - deehi tava pada bhaktiM, vaideehi patita paavanii, mee sadaa ( telugu andhra )