కీర్తనలు త్యాగరాజు నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి
అభేరి - ఆది
పల్లవి:
నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి
నన్ను బ్రోవగ రాద? శ్రీరఘువర నీ ॥న॥
అను పల్లవి:
నగరాజధర! నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసెడువారలు గారె? యిటు లుండుదురే? నీ ॥న॥
చరణము(లు):
ఖగరాజు నీ యానతి విని వేగ చనలేఁడో?
గగనాని కిలకు బహు దూరం బనినాఁడో?
జగమేలే పరమాత్మ! యెవరితోనీ మొఱలిడుదు?
వగ చూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత! ॥న॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nagumoomu ganaleeni naa jaali.r delisi ( telugu andhra )