కీర్తనలు త్యాగరాజు నడచి నడచి చూచే రయోధ్యానగరము గానరే
ఖరహరప్రియ - ఆది
పల్లవి:
నడచి నడచి చూచే రయోధ్యానగరము గానరే న..
అను పల్లవి:
పుడమిసుతసహాయుఁడై చెలంగే
పూర్ణుని ఆత్మారాముని గూడ న..
చరణము(లు):
అట్టె కనులఁగూర్చి తెఱచి సూత్రమునఁ
బట్టి వెలికి వేసధారులై
పుట్టుచావులేని తావు తెలియక
పొగడేరు త్యాగరాజవినుతుని న..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naDachi naDachi chuuchee rayoodhyaanagaramu gaanaree ( telugu andhra )