కీర్తనలు త్యాగరాజు నాడాడిన మాట నేడు తప్పవలదు నా తండ్రి శ్రీరామ
జనరంజని - చాపు
పల్లవి:
నాడాడిన మాట నేడు తప్పవలదు
నా తండ్రి శ్రీరామ ॥నా॥
అను పల్లవి:
ఏడాది నాడుగ యెడబాయనివాని
పోడిమిగఁ గాపాడుదునని చిన్న ॥నా॥
చరణము(లు):
తలకు వచ్చిన బాధ తలపాగకుఁ జేతు
వలచి నమ్మిన వాని వలలోనఁ దగులుదు
ఇల భక్తి సాగర మీదఁ జేతునని
తలఁబోసి పల్కితివే త్యాగరాజార్చిత ॥నా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naaDaaDina maaTa neeDu tappavaladu naa taMDri shriiraama ( telugu andhra )