కీర్తనలు త్యాగరాజు నాదలోలుఁడై బ్రహ్మానందమందవే మనసా
కల్యాణ వసంత - రూపక
పల్లవి:
నాదలోలుఁడై బ్రహ్మానందమందవే మనసా నా..
అను పల్లవి:
స్వాదుఫలప్రద సప్తస్వరరాగనిచయసహిత నా..
చరణము(లు):
హరిహరాత్మ భూ సురపతి శరజన్మ గణేశాది
వరమౌను లుపాసించరే ధర త్యాగరాజు తెలియు నా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naadaloolu.rDai brahmaanaMdamaMdavee manasaa ( telugu andhra )