కీర్తనలు త్యాగరాజు నామకుసుమములచేఁ పూజించే నరజన్మమే జన్మము మనసా
శ్రీ - దేశాది
పల్లవి:
నామకుసుమములచేఁ పూజించే నరజన్మమే జన్మము మనసా ॥నామ॥
అను పల్లవి:
శ్రీమన్మానస కనక పీఠమున
చెలగఁ జేసికొని వరశివరామ ॥నామ॥
చరణము(లు):
నాద స్వరమున వర నవరత్నపు
వేదికపై సకల లీలా వి
నోదుని, పరమాత్ముని, శ్రీరాముని
పాదములను త్యాగరాజ హృద్భూషణుని ॥నామ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naamakusumamulachee.r puujiMchee narajanmamee janmamu manasaa ( telugu andhra )