కీర్తనలు త్యాగరాజు నారద గురుసామి యికనైన నన్నాదరింపవేమి? ఈ కఱవేమి?
దర్బారు - ఆది
పల్లవి:
నారద గురుసామి యికనైన న
న్నాదరింపవేమి? ఈ కఱవేమి? ॥నారద॥
అను పల్లవి:
సారెకు సంగీత యోగ నైగమ
పారంగతుఁడైన పరమ పావన! ॥నారద॥
చరణము(లు):
ఇతిహాస పురాణాగమ చరితము - లెవరివల్లఁ గలిగె?
పతిని దానమివ్వ బుద్ధి సత్య - భామ కెటులఁ గలిగె?
ద్యుతిజిత శరదాభ్ర! నిను వినా, ముని
యతుల కెవరు గలిగె?
క్షితిని, త్యాగరాజ వినుత! న
మ్మితి చింత దీర్చి ప్రహ్లాదుని బ్రోచిన ॥నారద॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naarada gurusaami yikanaina nannaadariMpaveemi? ii kaRaveemi? ( telugu andhra )