కీర్తనలు త్యాగరాజు నిత్యరూప ఎవరి పాండిత్యమేమి నడచురా
కాపి - రూపక
పల్లవి:
నిత్యరూప ఎవరి పాండిత్యమేమి నడచురా ని..
అను పల్లవి:
సత్యమైన యాజ్ఞ మీర సామర్థ్యముగలదానికి ని..
చరణము(లు):
భాను పగలు రేయి రత్నసానుఁజుట్టఁడా?
పూని శేషుఁడమితభార భూమి మోయఁడా?
వీనులందు గాశీపతి నీ నామముఁ బల్కఁడా?
మాని త్యాగరాజవినుత మహిమాస్పదమగు నీ ముందు ని..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nityaruupa evari paaMDityameemi naDachuraa ( telugu andhra )