కీర్తనలు త్యాగరాజు నిధిచాల సుఖమో రాముని స
కల్యాణి - త్రిపుట ( - చాపు)
పల్లవి:
నిధిచాల సుఖమో రాముని స
న్నిధిసేవ సుఖమో నిజముగఁ బల్కు మనస ॥ని॥
అను పల్లవి:
దధి నవనీత క్షీరములు రుచో దాశ
రథీ ధ్యానభజన సుధారసము రుచో ॥ని॥
చరణము(లు):
శమ దమ మను గంగాస్నానము సుఖమో క
ర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమో
మమత బంధవయుత నరస్తుతి సుఖమో
సుమతి త్యాగ రాజనుతుని కీర్తన సుఖమో ॥ని॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nidhichaala sukhamoo raamuni sa ( telugu andhra )