కీర్తనలు త్యాగరాజు నిన్ను బాసి యెట్ల యుందురో? నిర్మలాత్ములౌ జనులు
బలహంస - ఆది
పల్లవి:
నిన్ను బాసి యెట్ల యుందురో? నిర్మలాత్ములౌ జనులు ॥నిను॥
అను పల్లవి:
అనఘ! సుపుణ్య అమర వరేణ్య!
సనక శరణ్య! సత్కారుణ్య! ॥నిను॥
చరణము(లు):
కనులకు చలువ, చెవుల కమృతము
విను రసనకు రుచి, మనసుకు సుఖము
తనువుకు యానందమును గల్గఁజేయు
త్యాగరాజ హృద్ధామ! పూర్ణకామ! ॥నిను॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ninnu baasi yeTla yuMduroo? nirmalaatmulau janulu ( telugu andhra )