కీర్తనలు త్యాగరాజు నిరవధిసుఖద నిర్మలరూప నిర్జితమునిశాప
రవిచంద్రిక - ఆది
పల్లవి:
నిరవధిసుఖద నిర్మలరూప నిర్జితమునిశాప ని..
అను పల్లవి:
శరధిబంధన నతసంక్రందన
శంకరాది గీయమాన సాధుమానస సుసదన ని..
చరణము(లు):
మామవ మరకతమణినిభదేహ
శ్రీరమణీలోల శ్రితజనపాల
భీమపరాక్రమ భీమకరార్చిత
తామసరాజసమానవదూర
త్యాగరాజవినుత చరణ ని..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niravadhisukhada nirmalaruupa nirjitamunishaapa ( telugu andhra )