కీర్తనలు త్యాగరాజు నీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నే నమ్మినాను
ధన్యాసి - చాపు
పల్లవి:
నీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నే నమ్మినాను ॥నీ॥
అను పల్లవి:
నా చిత్తము వంచన చంచలమని - నను విడనాడకుమి; శ్రీరామ! ॥నీ॥
చరణము(లు):
గురువు చిల్లగింజ - గురువే భ్రమరము
గురుఁడే భాస్కఁరుడు - గురుఁడే భద్రుఁడు
గురుఁడే యుత్తమగతి - గురువు నీ వనుకొంటి
ధరను దాసుని బ్రోవ - త్యాగరాజనుత! ॥నీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nii chittamu nishchalamu - nirmalamani ninnee namminaanu ( telugu andhra )