కీర్తనలు త్యాగరాజు నీ దయ గల్గుటే భాగ్యమని - నిజముగ నేల దోచదో?
రీతిగౌళ - ఆది
పల్లవి:
నీ దయ గల్గుటే భాగ్యమని - నిజముగ నేల దోచదో? ॥నీ దయ॥
అను పల్లవి:
నాద రూప! నీరద సన్నిభ! దిన
నాథాన్వయభూషణ! మృదు భాషణ! ॥నీ దయ॥
చరణము(లు):
అవివేకులైన దార తనయుల - నను దినమును గలిసి
భవ సాగరమున నీదలేక - భయమున జెయ్యలసి
యవనీశుల గాచి సుఖము - లేక ఆయాసము సొలసి
వివిధములగు నీ మాయ లోపలఁ
దగిలిన తనకీ యవధులను దెలిసి ॥నీ దయ॥
వేగి లేచి తా నతి లోభి జనుల - వెంబడిగఁ దిరిగి
రోగియై తా కోరిన కోర్కెలు - రోయక మేను కరఁగి
భోగ భాగ్యముల కొర కన్యసురుల - భూసురుల గోరి తిరిగి
యే గతియు లేక యీ సుఖంబు
లిట్లని తన మదిని తా నెఱిఁగి ॥నీ దయ॥
నాగ నాయక శయనేందు దిన నాథ నయన సీతాంక
యోగి వందిత పదారవింద యుగ శరణా కళంక
రాగ లోభ మదాదుల గొట్టి రక్షించెడు బిరుదాంక
త్యాగరాజ పూజిత రఘునాయక
తారకమని తెలియు నిశ్శంక ॥నీ దయ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nii daya galguTee bhaagyamani - nijamuga neela doochadoo? ( telugu andhra )