కీర్తనలు త్యాగరాజు నీ నామరూపములకు - నిత్య జయమంగళం
సౌరాష్ట్రము - ఆది
నీ నామరూపములకు - నిత్య జయమంగళం ॥నీ॥
పవమానసుతుఁడు బట్టు - పాదార విందములకు ॥నీ॥
పంకజాక్షి నెలకొన్న - యంకయుగమునకు ॥నీ॥
నలినారిగేరు చిరు - నవ్వుగల మోమునకు ॥నీ॥
నవముక్తాహారములు - నటియించు యురమునకు ॥నీ॥
ప్రహ్లాద నారదాది - భక్తులు పొగడుచుండు ॥నీ॥
రాజీవనయన త్యాగ - రాజ వినుతమైన ॥నీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nii naamaruupamulaku - nitya jayamaMgaLaM ( telugu andhra )