కీర్తనలు త్యాగరాజు నీకే తెలియకబోతే నేనేమి సేయుదురా?
ఆనందభైరవి - ఆది
పల్లవి:
నీకే తెలియకబోతే నేనేమి సేయుదురా? నీ..
అను పల్లవి:
లోకాధారుఁడవయ్యు నాలోని ప్రజ్వలించు జాలి నీ..
చరణము(లు):
ఎందెందుఁ జూచిన ఎందెందుఁ బలికిన
ఎందెందు సేవించిన ఎందెందుఁ బూజించిన
అందందు నీవని తోచేటందుకు నీ పాదార
విందమును ధ్యానించిన దెందుకని త్యాగరాజసన్నుత నీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niikee teliyakabootee neeneemi seeyuduraa? ( telugu andhra )