కీర్తనలు త్యాగరాజు నీవేరా కులధనము సంతతము నీవేరా జీవనము
బేగడ - చాపు
పల్లవి:
నీవేరా కులధనము సంతతము నీవేరా జీవనము నీ..
అను పల్లవి:
ఈ వఱకును తెలియకున్న నేరము
దేవర క్షమచేసి దయతో నేలుకోరా నీ..
చరణము(లు):
మాధవ సీతానుజ వరసహిత
మంగళకర పరమార్థభూతచరిత
గాధియాగ సంరక్షక సతత
గతిజాప్త నతజనావృత విధివినుత నీ..
సుజననిచయపాపహిమచండసూర్య
సుస్వరజిత ఘనరవమాధుర్య
అజముఖారి సమర నిరుపమశౌర్య
ఆనంద కంద సుందర సువర్య నీ..
రాఘవ సర్వోన్నత సుప్రకాశ
రమణీయకర పాటితలంకేశ
త్యాగరాజవర హృదయనివేశ
తరణి శశాంకలోచన జానకీశ నీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niiveeraa kuladhanamu saMtatamu niiveeraa jiivanamu ( telugu andhra )