కీర్తనలు త్యాగరాజు పట్టి విడువరాదు నా చేయి పట్టి విడువరాదు
మంజరి - ఆది
పల్లవి:
పట్టి విడువరాదు నా చేయి పట్టి విడువరాదు ॥ప॥
అను పల్లవి:
పుట్టిననాఁడే నిజభక్తిని మెడఁ
గట్టి గుట్టు చెదరక బ్రోచి చెయి ॥ప॥
చరణము(లు):
నిత్యానిత్యములను బోధించి
కృత్యాకృత్యములను దెలిపించి
ప్రత్యేకుఁడు నీవని కనిపించి
భృత్యుఁడైన త్యాగరాజు చెయి ॥ప॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paTTi viDuvaraadu naa cheeyi paTTi viDuvaraadu ( telugu andhra )