కీర్తనలు త్యాగరాజు పతికి హారతీరె సీతా
సురటి - ఆది
పల్లవి:
పతికి హారతీరె సీతా ॥ప॥
అను పల్లవి:
అతిమృదుతర సత్యభాషణునికి
అఖిలాండనాథునికి సీతా ॥ప॥
చరణము(లు):
బంగరురంగు భుజంగునిపైని చె
లంగుచును మరకతాంగుఁడు మెఱపు తె
ఱంగున మెఱయు తన యంగనతో బలు
కంగ జూచి యుప్పొంగుచు సీతా ॥ప॥
అక్కరతో నిరుప్రక్కల నిలచి త
ళుక్కని మెఱయఁగ చక్కనిమోమున
చుక్కలరాయని మక్కువతో సరి
ముక్కెర కదలగ గ్రక్కున సీతా ॥ప॥
రాజ విభాకర రాజధరామర
రాజశుకాజ విరాజులు చూడఁగ
రాజమానమగు గాజులు ఘల్లన
రాజిత త్యాగరాజనుతునికి శ్రీ ॥ప॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - patiki haaratiire siitaa ( telugu andhra )