కీర్తనలు త్యాగరాజు పరమాత్ముఁడు వెలిఁగే ముచ్చట బాగ తెలుసుకోరె
వాగధీశ్వరి - ఆది
పల్లవి:
పరమాత్ముఁడు వెలిఁగే ముచ్చట బాగ తెలుసుకోరె ॥ప॥
అను పల్లవి:
హరియట హరుఁడట సురులట నరులట
అఖిలాండ కోటులట యందఱిలో ॥ప॥
చరణము(లు):
గగనానిల తేజోజల భూమయమగు
మృగ ఖగ నగ తరుకోటులలో
సగుణములలో విగుణములలో సతతము
సాధు త్యాగరాజార్చితుఁ డిలలో ॥ప॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paramaatmu.rDu veli.rgee muchchaTa baaga telusukoore ( telugu andhra )