కీర్తనలు త్యాగరాజు పరలోక సాధనమే మనసా
పూరీ కల్యాణి - దేశాది
పల్లవి:
పరలోక సాధనమే మనసా ప..
అను పల్లవి:
స్మరలోభమోహాది పాపులను
స్మరియించకే శ్రీరామ భజన ప..
చరణము(లు):
జననాది రోగభయాదులచే
జగమందుఁ గల్గు దురాసలచేఁ
దనయాది బాంధవుల భ్రమచేఁ
దగల నీదు త్యాగరాజనుతుని భజన ప..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paralooka saadhanamee manasaa ( telugu andhra )