కీర్తనలు త్యాగరాజు పరలోకభయము లేక భవపాశ బద్ధు లయ్యెదరు
మందారి - దేశాది
పల్లవి:
పరలోకభయము లేక
భవపాశ బద్ధు లయ్యెదరు ॥పరలోక॥
అను పల్లవి:
కరి వాజి శృంగార రామ శిబి
కాదు లెల్ల మనకే గలిగెనని ॥పరలోక॥
చరణము(లు):
కొన్న కాంతలను కన్న బిడ్డలను
వన్నె చీరలను వాన గుడిసెలను
తిన్నగా గని దైవలోకమని
తన్నుకోళ్ళలో త్యాగరాజనుత ॥పరలోక॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paralookabhayamu leeka bhavapaasha baddhu layyedaru ( telugu andhra )