కీర్తనలు త్యాగరాజు పరాకు నీ కేలరా రామ
కిరణావళి - దేశాది
పల్లవి:
పరాకు నీ కేలరా? రామ! ॥పరాకు॥
అను పల్లవి:
చరాచరములు వసియించు, ఓ
సారసాక్షా! నా పను లనిన నీ ॥పరాకు॥
చరణము(లు):
పురాన శబరి యొసంగిన యటు నే
భుజించుకొన్న శేషమా? రామ!
ధరాతలమున గుహునివలెఁ బత్ర
తల్ప మొనర్చితినా? శ్రీ త్యాగరాజుపై ॥పరాకు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paraaku nii keelaraa raama ( telugu andhra )