కీర్తనలు త్యాగరాజు పరాకుఁ జేసిన నీకేమి ఫలము గలిగెరా? పరాత్పరా!
జుజాహుళి - ఆది
పల్లవి:
పరాకుఁ జేసిన నీకేమి
ఫలము గలిగెరా? పరాత్పరా! ॥ప॥
అను పల్లవి:
సురావనీ సురాప్త! మా
వరా! జరా పఘన! నా యెడన ॥ప॥
చరణము(లు):
ముదాన నీదు పదార వింద
ములను బట్టి మ్రొక్కగ లేదా?
నిదాన రూప! దరిదాపు లే
దు, దార! శ్రీత్యాగరాజనుత! ॥ప॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paraaku.r jeesina niikeemi phalamu galigeraa? paraatparaa! ( telugu andhra )