కీర్తనలు త్యాగరాజు పరాముఖమేలరా రామయ్య
సురటి - ఆది
పల్లవి:
పరాముఖమేలరా రామయ్య ప..
అను పల్లవి:
నిరాదరణ గలదా నీ యెడల
నిత్యానంద కల్యాణగుణ ప..
చరణము(లు):
ఇభరాజు నీకు ఏమైన
నిచ్చెనా తెలుపు
శుభప్రదుడు నీవే యనుచు
సుందర శ్రీ త్యాగరాజనుత ప..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paraamukhameelaraa raamayya ( telugu andhra )