కీర్తనలు త్యాగరాజు పాహి రామ రామ యనుచు భజన సేయవే
ఖరహరప్రియ - త్రిశ్రలఘు
పల్లవి:
పాహి రామ రామ యనుచు భజన సేయవే పా..
అను పల్లవి:
కనికరంబు గల్గి సీత కాంతుని కనఁగా
మనసు రంజిల్లఁ బల్కె మదన జనకుఁడు పా..
చరణము(లు):
వల్వను దిద్ది సౌమిత్రి వలచి నిల్వఁగా
కలువ రేకులను గేరు కనులఁ జూచెను పా..
భరతుఁడావేళఁ గరఁగి కరఁగి నిల్వఁగా
గరముఁబట్టి కౌగలించె వరదుఁడప్పుడు పా..
చండ శత్రుఘ్నుఁడపు డఖండభక్తితో
నుండ సంతసిల్లె కోదండరాముఁడు ప..
మనసుఁదెలిసి కలసి హనుమంతుఁడుండఁగా
చనువు మాటలాడుచుండె సార్వభౌముఁడు పా..
వీరికరుణ కలిగి యెపుడువెలసియుందునో
సారమైన భక్తిచే సన్నుతింతునో పా..
ధర్మార్థకామమోక్షదానమేలనే
మర్మమెఱుగలేని ఇంద్రశర్మమేలనే పా..
బాగ కరుణఁజేసి ఎపుడు భవ్యమొసఁగునో
త్యాగరాజు చేయి బట్టే దయను జూతునో పా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paahi raama raama yanuchu bhajana seeyavee ( telugu andhra )