కీర్తనలు త్యాగరాజు పాహి రామదూత జగ త్ప్రాణకుమార మాం
వసంతవరాళి - రూపక
పల్లవి:
పాహి రామదూత జగ త్ప్రాణకుమార మాం పా..
అను పల్లవి:
వాహినీశతరణ దశవదనసూనుతనుహరణ పా..
చరణము(లు):
ఘోరాసురవారాంనిధి కుంభతనయ కృతకార్య
పారిజాత తరునివాస పవనతుల్యవేగ పా..
పాదవిజిత దుష్టగ్రహ పతితలోకపావన
వేదశాస్త్ర నిపుణవర్య విమలచిత్త సతతం మాం పా..
తరుణారుణవదనాబ్జ తపనకోటి సంకాశ
కరధృత రఘువర సుచరణ కలిమలాభ్ర గంధవహ పా..
కరుణారసపరిపూర్ణ కాంచనాద్రి సమదేహ
పరమభాగవతవరేణ్య వరద త్యాగరాజనుత పా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paahi raamaduuta jaga tpraaNakumaara maaM ( telugu andhra )