కీర్తనలు త్యాగరాజు పూలపాన్పుమీద బాగ పూర్ణ పవ్వళించు
ఆహిరి - త్రిశ్రలఘు
పల్లవి:
పూలపాన్పుమీద బాగ పూర్ణ పవ్వళించు ॥పూ॥
అను పల్లవి:
నీలఘనశ్యామహరే నిరుపమ రామయ్య మల్లె ॥పూ॥
చరణము(లు):
మధుశర్కర యానబాలు మఱి యారగించి
విధుముఖ కమ్మని విడెమువేసి ననుఁ గటాక్షించి ॥పూ॥
పరిమళగంధంబు మేన బాగుగాను బూసి
మెఱయఁగ సుమహారములను మెడనిండను వేసి ॥పూ॥
ఆగమోక్త మైనశయ్య నంగీకరించి
త్యాగరాజ కృతములెల్ల తథ్యమని సంతోషించి ॥పూ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - puulapaanpumiida baaga puurNa pavvaLiMchu ( telugu andhra )