కీర్తనలు త్యాగరాజు పేరిడి నిను బెంచినవా రెవరే
ఖరహరప్రియ - ఆది
పల్లవి:
పేరిడి నిను బెంచినవా రెవరే పే..
చరణము(లు):
వారిని జూపవే శ్రీరామయ్య పే..
సారసారతర తారకనామమును పే..
సర్వమతములకు సమ్మతమైన పే..
ఘోరపాతకముల గొప్పున యణచు పే..
త్యాగరాజు సదా బాగుగా భజియించు పే..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - peeriDi ninu beMchinavaa revaree ( telugu andhra )