కీర్తనలు త్యాగరాజు ప్రక్కల నిలఁబడి గొలిచెడి ముచ్చట బాగ దెల్పరాదా
ఖరహరప్రియ - త్రిపుట
పల్లవి:
ప్రక్కల నిలఁబడి గొలిచెడి ముచ్చట బాగ దెల్పరాదా ॥ప॥
అను పల్లవి:
చుక్కల రాయని గేరు మోముఁగల
సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు ॥ప॥
చరణము(లు):
తనువుచే వందన మొనరించుచున్నారా
చనవున నామకీర్తన సేయుచున్నారా
మనసున దలిచి మైమరచియున్నారా
నెనరుంచి త్యాగరాజునితో హరిహరి వీరిరు ॥ప॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - prakkala nila.rbaDi golicheDi muchchaTa baaga delparaadaa ( telugu andhra )