కీర్తనలు త్యాగరాజు బడలిక దీర పవ్వళించవే
రీతిగౌళ - ఆది
పల్లవి:
బడలిక దీర పవ్వళించవే ॥బ॥
అను పల్లవి:
సడలని దురితములను తెగఁగోసి సార్వభౌమ సాకేతరామ ॥బ॥
చరణము(లు):
పంకజాసనుని పరితాపముఁగని - పంకజాప్త కులపతివై వెలసి
పంకజాక్షితో వనమునకేగి జింకను వధియించి
మంకురావణుని మదమునణచి - నిశ్శంకుడౌ విభీషణునికి బంగారు
లంకనొసఁగి సురలబ్రోచిన నిష్కళంక త్యాగరాజనుత రామ ॥బ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - baDalika diira pavvaLiMchavee ( telugu andhra )