కీర్తనలు త్యాగరాజు బాగాయెనయ్యా నీ మాయలెంతో
చంద్రజ్యోతి - దేశాది
పల్లవి:
బాగాయెనయ్యా నీ మాయలెంతో
బ్రహ్మకైనఁ గొనియాడఁ దరమా? బా..
అను పల్లవి:
ఈ గారుడమును యొనరించుచును
నేఁ గాదనుచు బల్కేదియును బా..
చరణము(లు):
అలనాఁడు కౌరవుల నణచఁమన
అలరి దోసమనే నరునిఁ జూచి పాప
ఫలము నీకు తనకు లేదని చక్కఁగఁ
బాలనము సేయలేదా? త్యాగరాజనుత! బా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - baagaayenayyaa nii maayaleMtoo ( telugu andhra )