కీర్తనలు త్యాగరాజు బుద్ధిరాదు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినక
శంకరాభరణ - చాపు
పల్లవి:
బుద్ధిరాదు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినక బు..
అను పల్లవి:
బుద్ధిరాదు బుద్ధిరాదు భూరి విద్యల నేర్చిన బు..
చరణము(లు):
ధాన్యధనములచేత ధర్మమెంతయుఁ జేసిన య
నన్య చిత్తభక్తుల వాగమృతపానము సేయక బు..
మానక భాగవతాది రామాయణములు చదివిన
మానుషావతారచరిత మర్మజ్ఞుల జతఁ గూడక బు..
యోగము లభ్యసించిన భోగములెంతో కల్గిన
త్యాగరాజనుతుఁడౌ రామ దాసుల చెలిమి సేయక బు..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - buddhiraadu buddhiraadu peddala suddulu vinaka ( telugu andhra )