కీర్తనలు త్యాగరాజు భజనపరులకేల దండ - పాణి భయము మనసా! రామ
సురటి - రూపకము
పల్లవి:
భజనపరులకేల దండ - పాణి భయము మనసా! రామ॥భ॥
అను పల్లవి:
అజ రుద్ర సురేశుల - కాస్థానమొసంగు రామ ॥భ॥
చరణము(లు):
అండకోట్ల నిండిన కో - దండిపాణి ముఖమును హృత్‌
పుండరీకమునఁజూచి - పూజ సల్పుచు
నిండుప్రేమతోఁ గరంగు - నిష్కాములకు వరవే
దండ పాలు దాసుఁడైన - త్యాగరాజుసేయు నామ ॥భ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - bhajanaparulakeela daMDa - paaNi bhayamu manasaa! raama ( telugu andhra )