కీర్తనలు త్యాగరాజు భజరే రఘువీరం శర - భరిత దశరథకుమారం
కల్యాణి - ఆది
భజరే రఘువీరం శర - భరిత దశరథకుమారం ॥భ॥
నీవు దురాసల రోసి పర - నిందల నెల్లను బాసి ॥భ॥
పంచేంద్రియమ్ముల నణఁచు - ప్రపంచసుఖము విస మనుచు ॥భ॥
కామాదుల నేగించి నీ - కార్యములను సాధించి ॥భ॥
అన్నియు పనికొదిగేనా ఇటు - అటు తిరిగినఁ దెలిసేనా ॥భ॥
వేఱే పనులకుఁ బోక గోముఖ - వ్యాఘ్రము చందముగాక ॥భ॥
తప్పుతంటలనుమాని భవ - తరణమునను మతిఁబూని ॥భ॥
కర్మముహరికి నొసంగి సత్‌ - కార్యములం దుప్పొంగి ॥భ॥
భక్తిమార్గమును దెలిసి నిజ - భాగవతుల జతకలసి ॥భ॥
మాయారహితుని గొలిచి నీ - మనమున రామునిఁ దలఁచి ॥భ॥
రాజాధిపుగా వెలసి త్యాగ - రాజ వరదుఁడని దెలిసి ॥భ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - bhajaree raghuviiraM shara - bharita dasharathakumaaraM ( telugu andhra )