కీర్తనలు త్యాగరాజు భవనుత నా హృదయమున రమింపుము బడలికదీఱ
మోహన - ఆది
పల్లవి:
భవనుత నా హృదయమున రమింపుము బడలికదీఱ భ..
అను పల్లవి:
భవతారక నాతో బహుబల్కిన బడలికదీఱ కమల సం భ..
చరణము(లు):
పవనసుతప్రియ తనకై తిరిగిన బడలిక దీఱ
భవనముఁజేరి నన్ను వెఱపించిన బడలికదీఱ కమల సం భ..
వరమగు నైవేద్యములను సేయని బడలికదీఱ
పరవలేక సరిపోయినట్టాడిన బడలికదీఱ కమల సం భ..
ప్రబలఁజేసి ననుఁ బ్రోచేననుకొన్న బడలికదీఱ
ప్రభు నీవు త్యాగరాజునికి బడలికదీఱ కమల సం భ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - bhavanuta naa hR^idayamuna ramiMpumu baDalikadiiRa ( telugu andhra )