కీర్తనలు త్యాగరాజు మనసా ఎటులోర్తునే నా
మలయమారుతము - రూపకము
పల్లవి:
మనసా ఎటులోర్తునే నా
మనవిని చేకొనవే ఓ ॥మ॥
చరణము(లు):
దినకరకుల భూషణుని
దీనుఁడవై భజనఁజేసి
దినముఁ గడుపమనిన నీవు
వినవదేల గుణవిహీన ॥మ॥
కలిలో రాజస తామస గుణములు - గలవారి చెలిమి
కలిసిమెలసి తిఱుగుచు మఱి - కాలము గడపకనే
సులభముగాఁ గడతేరను - సూచనలను దెలియఁజేయు
ఇలను త్యాగరాజుమాట - వినవదేల గుణవిహీన ॥మ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manasaa eTuloortunee naa ( telugu andhra )