కీర్తనలు త్యాగరాజు మనసా శ్రీరామచంద్రుని మఱవకే ఏమఱకే ఓ
ఈశమనోహరి - ఆది
పల్లవి:
మనసా శ్రీరామచంద్రుని మఱవకే ఏమఱకే ఓ మ..
అను పల్లవి:
మును బుట్టను పుట్టిన మౌనికృతమున
మూడున్నారధ్యాయమునఁ జూచుకో మ..
చరణము(లు):
సృష్టి పుష్టి నష్టి సేయు పనులు ని
కృష్టమనుచును త్రిమూర్తుల కొసఁగి మ..
తుష్టుఁడై బరగె సద్భక్త మనో
భీష్టములిచ్చే త్యాగరాజనుతుని మ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manasaa shriiraamachaMdruni maRavakee eemaRakee oo ( telugu andhra )