కీర్తనలు త్యాగరాజు మనసా, మన సామర్ధ్యమేమి?
వర్ధని - రూపకం
పల్లవి:
మనసా, మన సామర్ధ్యమేమి? ఓ ॥మనసా॥
అను పల్లవి:
విను సాకేతరాజు విశ్వమనే రధము నెక్కి
తన సామర్థ్యము చేఁ దానే నడిపించెనే ॥మనసా॥
చరణము(లు):
అలనాఁడు వసిష్ఠాదులు బట్టము గట్టే పలు
కులు విని వేగమే భూషణముల నొసఁగిన కైకనుఁ
పలుమారు జగంబులు కల్లమనిన రవిజుని మాయ
వల వేసి త్యాగరాజ వరదుఁడు దాఁ జనగలేదా ॥మనసా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manasaa, mana saamardhyameemi? ( telugu andhra )