కీర్తనలు త్యాగరాజు మనసు స్వాధీనమైన యా ఘనునికి
శంకరాభరణము - రూపకము
పల్లవి:
మనసు స్వాధీనమైన యా ఘనునికి
మఱి మంత్రతంత్రము లేల ॥మ॥
అను పల్లవి:
తనువు తానుగాదని యెంచువానికి
తపసు చేయనేల దశరథబాల ॥మ॥
చరణము(లు):
అన్ని నీవనుచు యెంచినవానికి
యాశ్రమ భేదములేల
కన్నుగట్టు మాయలని యెంచువానికి
కాంతల భ్రమలేల దశరథబాల ॥మ॥
ఆజన్మము దుర్విషయ రహితునికి గ
తాగత మికనేల
రాజరాజేశ నిరంజన నిరుపమ
రాజవదన త్యాగరాజ వినుత ॥మ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manasu svaadhiinamaina yaa ghanuniki ( telugu andhra )