కీర్తనలు త్యాగరాజు మరచెడు వాడనా? రామ నిను మదన జనక
కేదారం - ఆది
పల్లవి:
మరచెడు వాడనా? రామ నిను మదన జనక ॥మరచెడు॥
అను పల్లవి:
మరకతాంగ నీయొక్క మది నెంచవలదు ॥మరచెడు॥
చరణము(లు):
కాని మానవులు గరుణ లేక నాపై
లేని నేరము లెంచిన గాని
శ్రీ నిజముగ నీ చెంత జేరిన గాని
రాని నీ దయ త్యాగరాజనుత ॥మరచెడు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maracheDu vaaDanaa? raama ninu madana janaka ( telugu andhra )