కీర్తనలు త్యాగరాజు మఱుగేలరా ఓ రాఘవ
జయంతశ్రీ - దేశాది
పల్లవి:
మఱుగేలరా ఓ రాఘవ ॥మ॥
అను పల్లవి:
మఱుగేల చరాచర రూప! పరా
త్పర! సూర్య సుధాకరలోచన! ॥మ॥
చరణము(లు):
అన్ని నీవనుచు అంతరంగమున
తిన్నగా వెతకి తెలిసికొంటినయ్య
నిన్నెగాని మది నెన్నఁ జాల నొరుల
నన్నుఁ బ్రోవవయ్య త్యాగరాజనుత ॥మ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maRugeelaraa oo raaghava ( telugu andhra )