కీర్తనలు త్యాగరాజు మహిత ప్రవృద్ధ శ్రీమతి గుహ గణపతిజననీ
కాంభోజి - చాపు
పల్లవి:
మహిత ప్రవృద్ధ శ్రీమతి గుహ గణపతిజననీ మ..
అను పల్లవి:
పాహి వదనజితసుధాకరే శ్రీకరే
పాహి సుగుణరత్నాకరే మ..
చరణము(లు):
దేహి చరణభక్తిమఖిల దేహిని సదాశుభఫల
దే హిమగిరితనయే వైదేహీవ సహోదరి మ..
వాహినీశ సన్నుతే నవాహిభూష వల్లభే భ
వాహి నీలకంఠి సింహవాహినీ జననీ మ..
పార్థసన్నుతప్రియే పదార్థపుణ్యదూరే కామి
తార్థఫలదే శ్రీతపస్తీర్థపురనివాసినీ మ..
రాజశేఖరాత్మభూ విరాజరాజసన్నుతే స
రోజ దళనిభాక్షీ త్యాగరాజ భాగ్యదాయకి మ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - mahita pravR^iddha shriimati guha gaNapatijananii ( telugu andhra )